రేపు రవీంద్ర భారతీలో సినీ సంగీత విభావరి

Fri,November 22, 2019 07:21 AM


హిమాయత్‌నగర్‌: ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల 85వ జన్మదినం పుర స్కరించుని ఈ నెల 23వ తేదీన రవీంద్ర భారతీలో పాడనా తెలుగు పాట పేరిట సుశీల సినీ హిట్స్‌ పాటల సంగీత విభావరి నిర్వహి స్తున్నట్లు సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సంస్థ అధ్యక్షుడు బండారు సుబ్బారావు,గాయని ఆమనిలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ పత్రికా దినో త్సవం సందర్భంగా ప్రముఖ పాత్రికేయులకు పాత్రికేయ శిరోమణి పురస్కారాలు ప్రధా నోత్సవం చేయనున్నట్లు వారు చేప్పారు.రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌,న్యూఢిల్లీ తెలంగాణ అధికార ప్రతి నిధి సముద్రాల వేణుగోపాల చారి,ప్రతినిధులు ఆర్‌ఎన్‌సింగ్‌,వైకె నాగేశ్వరరావు, రఫీ,హరి నారాయణరెడ్డిలు పాల్గొంటారని తెలిపారు.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles