ఈ నెల 19న సినీ సంగీత విభావరి

Mon,September 17, 2018 06:46 AM
cine sangeetha vibavari

హిమాయత్‌నగర్ : మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న రవీంద్ర భారతిలో నా పాట.. నీ నోట పలకాలి చిలకా.. అనే సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రఖ్యాత గాయని ఆమని, ప్రతినిధులు భీంరెడ్డి, ఆర్‌ఎన్, సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సాహితీ వేత్త వాసిరాజు ప్రకాశంకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందజేస్తారని, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, యువ కళావహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర్‌రావు పాల్గొంటారన్నారు.

1509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS