ఆర్ ఎక్స్ 100 హీరోయిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

Sun,July 15, 2018 10:34 AM
cine lovers praise on rx 100

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన అజ‌య్ భూప‌తి ఆర్ ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు. మొద‌టి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను చూపించి అంద‌ర‌కు అవాక్క‌య్యేలా చేశాడు. జూలై 12న విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కేవ‌లం త‌న గ్లామ‌ర్‌తోనే కాక బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో జీవించింది. ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డం సినీ ప్రేక్ష‌క‌లోకానికి కొత్త‌గా అనిపించింది. ఇక లిప్ లాక్ సీన్స్ లోను ఈ అమ్మ‌డు అద‌ర‌గొట్టింది. పాయ‌ల్ పాత్ర‌ని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వ‌చ్చి ఇచ్చిన పాత్ర‌కి న్యాయం చేసిందని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు సినీ జ‌నాలు. అయితే ఈ సినిమాకి పాయ‌ల్ కేవ‌లం 6 ల‌క్ష‌లు మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. త‌క్కువ పారితోషికం తీసుకున్నా ఎక్కువ న్యాయం చేసిన ఈ బ్యూటీకి రానున్న రోజుల‌లో మంచి ఆఫర్స్ రావ‌డం ఖాయ‌మంటున్నారు. చిత్రంలో కార్తికేయ ప్ర‌ధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

3218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS