ముగిసిన సినీ పెద్ద‌ల స‌మావేశం

Sat,April 21, 2018 01:31 PM
cine celebrities meeting completed

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌పూర్ణ స్డూడియో సెవెన్ ఎక‌ర్స్‌లో జ‌రిగిన ఈ స‌మావేంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నిర్మాతల మండలి, నటీనటుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన విస్తృతస్థాయి భేటీలో కాస్టింగ్ కౌచ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. స‌మావేశం త‌ర్వాత సినీ ప్ర‌ముఖులు ఎవ‌రు మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్ళిపోయారు. ఇక ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది . గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని స‌మాచారం.

4098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles