అట‌ల్ బిహారీకి సినీ ప్ర‌ముఖుల నివాళి

Fri,August 17, 2018 12:30 PM
cine celebrities condolences to atal bihari

రాజకీయ రంగంలో తీరిక లేకుండా గడిపినా, ప్రధానిగా ఢిల్లీ గద్దెనెక్కినా.. తన అక్షర పిపాసను వదులని రాజ‌కీయ బీష్ముడు అటల్ బిహ‌రీ వాజ్‌పేయి. ఆయన రచనల సంఖ్య తక్కువే అయినా అన్నీ లోతైన అర్థాలతో నిండి ఉంటాయి. ఏరికోరి కూర్చినట్టు ఉండే పదాలతో ఎన్నటికీ తాజాగా.. సజీవంగా నిలుస్తాయి. అందుకే కొందరు నాయకులు ఆయన్ని ప్రేమగా మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు. అట‌ల్‌కి సినీ సెల‌బ్రిటీల‌తో కూడా అనుబంధం ఎక్కువే. ఆయన మృతి ప్ర‌తి ఒక్క‌రికి తీర‌ని లోటు. అట‌ల్ బిహారీకి నివాళులు అర్పిస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న బ్లాగ్‌లో అట‌ల్ బిహారీతో త‌న‌కి ఉన్న సాన్నిహిత్యం గురించి చర్చించాడు.అట‌ల్ స్పీచెస్ విని తాను ఎంతో ఇంప్రెస్ అయ్యాన‌ని చెప్పిన అమితాబ్ త‌న తండ్రి పేరుతో అట‌ల్‌జీ స్టాంప్ విడుద‌ల చేయ‌డం గ‌ర్వంగా భావిస్తున్న‌ట్టు తెలిపాడు. ప్రఖ్యాతి గాంచిన నాయకుడిగా అతని ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, నా తండ్రితో కలవడానికి ఎన్నడూ సంకోచించలేదు ... ముఖ్యంగా నా తండ్రి ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పుడు, పరిస్థితి గురించి అట‌ల్ జీ అడిగారు. అతని కరుణ మ‌రియు ద‌య ఎంతో గొప్ప‌ది అంటూ బిగ్ బీ త‌న బ్లాగ్ లో రాశారు.

ఇక గాన కోకిల ల‌తా మంగేష్కర్ ‘అటల్ బిహారీ నాకు తండ్రిలాంటి వారు అని చెప్పారు . ఆయన నన్ను బేటీ అని పిలిచేవారు. నేను ఆయనను దాదా అనేదాన్ని. నా తండ్రిని మరోసారి కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనను ప్రశంసించేందుకు మాటలు సరిపోవు’ అని లతా మంగేష్కర్‌ అన్నారు. అంతేకాదు వాజ్ పేయితో త‌న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పుణెలో తాము ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా.. ఆయన వచ్చారని అద్భుతమైన ప్రసంగం చేశారని చెప్పారు. ఆయనలాంటి వక్త భారత రాజకీయాల్లో మరెవ్వరూ లేరని అన్నారు. 2014లో లత వాజ్‌పేయీ గీతాలను ఆల్బమ్‌గా రూపొందించారు. అట‌ల్ బిహారీ మ‌ర‌ణం ఈ దేశానికి తీర‌ని లోటు . ఆ మహోన్న‌త నేత‌కి మోహ‌న్ లాల్‌, ర‌జ‌నీకాంత్‌, షారూఖ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మోహ‌న్ బాబు , బాల‌కృష్ణ ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లు భాషా న‌టులు నివాళులు అర్పించారు. ఆయ‌న ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS