మెగా హీరో ఈవెంట్‌కి గెస్ట్‌గా చిరు

Wed,June 6, 2018 10:54 AM
chru chief guest for tej movie

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది. క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్ న‌డుస్తుంది. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాత‌లు అన్నారు.

గోపి సుంద‌ర్ తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రానికి సంగీతం అందించ‌గా, ఆయ‌న స‌మ‌కూర్చిన బాణీల‌ని జూన్ 9న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ కన్వెన్ష‌న్ హాల్‌లో జ‌ర‌గ‌నున్న ఆడియో వేడుక‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నాడు. తేజూ న‌టించిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల ఆడియో వేడుకకి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా,ఈ రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. మ‌రి ఆ సెంటిమెంట్ తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రానికి కూడా వ‌ర్తిస్తుందేమోన‌ని అభిమానులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.1734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles