టాప్ ట్రెండింగ్‌లో ఉన్న 'మ‌హ‌ర్షి' ఫ‌స్ట్ సాంగ్

Sat,March 30, 2019 01:29 PM
choti Choti Baatein Song Trending at no 1 on Youtube

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం మ‌హ‌ర్షి మే 9న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం నుండి తొలి సాంగ్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఛోటీ ఛోటీ బాతే అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ చ‌క్క‌ని బాణీలు అందించడ‌మే కాక స్వ‌యంగా ఆల‌పించారు. శ్రీ మ‌ణి లిరిక్స్ అందించారు. పూజా హెగ్డే, మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ ఈ ముగ్గురి స్నేహం, వారి ప్ర‌యాణం నేప‌థ్యంలో సాంగ్‌ని రూపొందించారు. చోటి చోటి చోటి చోటి బాతే.. మీఠి మీఠి మీఠి మీఠి యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే..ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు.. అంటూ సాగే ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతుంది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చిత్ర బృందం ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. మ‌హ‌ర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే కథానాయిక‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ .. మ‌హేష్ స్నేహితుని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకోగా, వేగ‌వంతంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం మ‌హేష్‌కి మంచి విజ‌యం అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు.

1293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles