మ‌హ‌ర్షి నుండి ఛోటీ ఛోటీ బాతే సాంగ్ విడుద‌ల‌

Fri,March 29, 2019 09:10 AM
Choti Choti Baatein  song released

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ మూవీ మ‌హ‌ర్షి చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రం నుండి తొలి సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఛోటీ ఛోటీ బాతే అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ చ‌క్క‌ని బాణీలు అందించడ‌మే కాక స్వ‌యంగా ఆల‌పించారు. శ్రీ మ‌ణి లిరిక్స్ అందించారు. పూజా హెగ్డే, మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ ఈ ముగ్గురి స్నేహం, వారి ప్ర‌యాణం నేప‌థ్యంలో సాంగ్‌ని రూపొందించారు. మ‌హ‌ర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే కథానాయిక‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ .. మ‌హేష్ స్నేహితుని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకోగా, వేగ‌వంతంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం మ‌హేష్‌కి మంచి విజ‌యం అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు.




1389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles