కోలీవుడ్ డెబ్యూ ఇవ్వ‌బోతున్న విక్ర‌మ్ బంధువు

Wed,March 14, 2018 10:26 AM
Chiyaan Vikram  Nephew meake his kollywood debut

ఈ ఇండ‌స్ట్రీ ఆ ఇండ‌స్ట్రీ అనే తేడా లేకుండా అన్ని భాష‌ల‌లోను వార‌సుల హ‌వా కొన‌సాగుతూ వ‌స్తుంది. చియాన్ విక్రమ్ త‌న‌యుడు ధృవ్ రీసెంట్‌గా అర్జున్‌రెడ్డి రీమేక్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్మ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌కి సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో ధృవ్ లుక్ ఎలా ఉంటుంది అనే స‌స్పెన్స్‌కి చియాన్ విక్ర‌మ్ ఇటీవ‌ల బ్రేక్ వేశాడు. ధృవ్ ఫోటో ఒక‌టి త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ ఆనందాన్ని అందించాడు. ఇక విక్ర‌మ్ చెల్లెలి త‌న‌యుడు అర్జుమాన్ కూడా త్వ‌ర‌లో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని చెన్నై టైమ్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. మ‌రి అర్జుమాన్ ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు, ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవ‌రు అనే విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.


1267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles