అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో సినిమా నుండి త‌ప్పుకున్నా:న‌టి

Sun,October 14, 2018 12:49 PM
Chitrangada Singh recalls harassment on Babumoshai Bandookbaaz

మీటూ ఉద్య‌మం ఉదృతం కావ‌డంతో ఇన్నాళ్ళు పెద్దోళ్లుగా వ్య‌వ‌హ‌రించిన వారి చీక‌టి కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బాధితులు త‌మ గోడు వెళ్ల‌బుచ్చుకోగా తాజాగా చిత్రాంగ‌ద త‌న‌తో ద‌ర్శ‌కుడు కుషాన్ నంది ప్ర‌వ‌ర్తించిన తీరుని చెబుతూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. 2016లో తెర‌కెక్కిన బాబూ మ‌షాయ్ చిత్ర షూటింగ్ స‌మయంలో చిత్రాంగ‌ద‌కి న‌వాజుద్దీన్ సిద్ధీఖీతో ఓ సీన్‌ని డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. మంచంపై చిత్రాంగ‌ద సీన్ చేయాల్సి ఉండ‌గా, ద‌ర్శ‌కుడు త‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది. బ‌టన్స్ లేని జాకెట్‌ని త‌న‌తో తొడిగించి, ఆ త‌ర్వాత కాళ్ళ‌ని ప‌క్క‌కు జరిపి లంగాని పైకి ఎత్తి న‌వాజుద్దీన్‌ని ప‌డుకో అని చెప్పాడ‌ట‌. ఆ సీన్ వ‌ద్ద‌ని ఎంత చెప్పిన కూడా విన‌లేద‌ట‌. ముందు చెప్పని సీన్‌ను హడావిడిగా చిత్రీకరించే ప్రయత్నం ఆ ద‌ర్శ‌కుడు చేశారని చిత్రాంగ‌ద అంటుది. అయితే ఆ సీన్ స‌మ‌యంలో నవాజుద్దీన్ ప‌క్క‌నే ఉన్నా కూడా డైరెక్ట‌ర్‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని ఆమె చెప్పుకొచ్చింది. ఇంట‌ర్వ్యూలో ఓ సీన్ షూటింగ్ స‌మ‌యంలో మ‌స్తు మ‌జా చేసాను అని అన్నాడు. ఆ బాధ‌లు భ‌రించ‌లేక‌నే చిత్రం నుండి త‌ప్పుకున్నా అని చిత్రాంగ‌ద స్ప‌ష్టం చేసింది. అయితే చిత్రాంగ‌ద ఆరోపణలను దర్శకుడు కుషాన్ తోసిపుచ్చాడు. సరిగా నటించకపోవడం వల్లనే ఆమెను ఆ సినిమా నుంచి తప్పుకోమని చెప్పాం. ఆ తర్వాత ఆమె స్థానంలో బిదితా బేగ్‌ను తీసుకొన్నామని కుషాన్ అన్నాడు.

7750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS