శ్రీవారిని దర్శించుకున్న చిత్రలహరి మూవీ టీం

Tue,April 9, 2019 12:50 PM
chitralahari movie team visits Tirumala

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మతేజ్ ,చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల, నటుడు చలపతి రావులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ధర్మతేజ్ మరియు టీమ్ కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చామని.. చిత్రలహరి సినిమా 12వ తేదీన విడుదల కానుందని, ఘనవిజయం సాధించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు సాయి ధర్మతేజ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles