ఇబ్బందుల్లో తేజూ చిత్రం..!

Sun,November 25, 2018 10:01 AM

మెగా మేన‌ల్లుడు తేజూ కెరియ‌ర్ స్టార్టింగ్‌లో వ‌రుస విజ‌యాల‌తో జెట్‌లా దూసుకెళ్ళాడు. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు మ‌నోడిని కుంగ‌దీసాయి. ఈ సారి ఎలా అయిన మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో తేజూ ఉండ‌గా, సినిమా రిలీజ్ స‌మ‌స్య‌గా మారింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తేజూ ప్ర‌స్తుతం కిషోర్ తిరుమలతో చిత్ర‌ల‌హ‌రి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రితికా సింగ్‌ని ఓ క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌గా, రెండో హీరోయిన్ కోసం క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ని సెల‌క్ట్ చేశార‌ని అంటున్నారు.


చిత్ర‌ల‌హ‌రి సినిమాని వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తామ‌ని ఇంతక ముందే ప్ర‌క‌టించారు. అయితే ఏప్రిల్ 5న‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి చిత్రం విడుద‌ల కానుంది. స్టార్ హీరో సినిమా కాబ‌ట్టి ఈ సినిమాతో పోటీ ప‌డే సాహ‌సం టీం చేయ‌దు. ప‌క్కా రెండు వారాల గ్యాప్ తీసుకుంటారు. ఏప్రిల్ 19న విడుద‌ల చేద్దామంటే నాని న‌టించిన జెర్సీ చిత్రం అదే రోజు విడుద‌ల అవుతుంది. నాని సినిమాతో పోటీ ప‌డేందుకు కూడా నిర్మాత‌లు సిద్ధంగా లేరు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 26నే మూవీని విడుద‌ల చేస్తే బాగుంటుందేమో అని లోలోప‌ల చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు టాక్‌. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన ఈ మూవీ సాయిధ‌ర‌మ్ తేజ్‌కి మ‌ర‌చిపోలేని గిఫ్ట్‌గా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

2415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles