చిరు 152వ మూవీ టైటిల్ వార్త‌లని కొట్టి పారేసిన ప్రొడ‌క్ష‌న్ సంస్థ

Fri,October 18, 2019 09:13 AM

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.ఇటీవల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. సామాజిక అంశాల‌కి క‌మ‌ర్షియ‌ల్ విలువలు జోడించి సినిమాని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్ర టైటిల్ గోవిందం ఆచార్య అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అంతేకాదు ఈ టైటిల్‌తో పోస్ట‌ర్ కూడా రూపొందించి వైర‌ల్ చేస్తున్నారు. పోస్ట‌ర్‌లో చిరు క‌మ్యూనిస్ట్ గెట‌ప్‌లో గ‌న్ ప‌ట్టుకొని ఉండ‌గా, వెనుక ద‌ళం ఉంది. ఫ్యాన్స్ త‌యారు చేసిన ఈ పోస్ట‌ర్ ఒరిజ‌న‌లా కాదా అనే దానిపై అభిమానులు సందిగ్ధం చెందుతున్న స‌మ‌యంలో చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ స్పందించింది. మేము ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని, టైటిల్ పెట్టిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం అని క్లారిటీ ఇచ్చారు. దేవాల‌యాల‌కి సంబంధించిన నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.
2985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles