చిన్న అల్లుడితో చిరు సంద‌డి

Tue,January 16, 2018 09:56 AM
chiru with kalyan

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సంద‌ర్భంగా త‌న చిన్న అల్లుడు, శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్‌తో క‌లిసి సంద‌డి చేశారు. పంచెక‌ట్టులో న‌ల్ల క‌ళ్ళ‌ద్దాలు పెట్టుకొని త‌న అల్లుడితో ఫోటోకి ఫోజులిచ్చిన చిరు చాలా కూల్‌గా క‌నిపించారు. వీరిద్ద‌రిని ఇలా చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోయారు. క‌ళ్యాణ్ ఇప్ప‌టికే న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటుండ‌గా, త్వ‌ర‌లోనే వెండితెర‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. జ‌త‌క‌లిసే ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా, సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయ‌ని తెలుస్తుండ‌గా, ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నార‌ట‌. మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించ‌నుందని సమాచారం. ఇక చిరు క్రేజీ ప్రాజెక్ట్ సైరా ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

2738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS