చిరు ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కి షాక్ అయిన రాయ్ ల‌క్ష్మీ

Thu,November 23, 2017 11:59 AM
chiru wishes to raai laxmi

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేస్తూ గ్లామ‌ర్ ప‌రంగా మంచి మార్కులు కొట్టేసింది రాయ్ ల‌క్ష్మీ. ఇక ఇప్పుడు జూలీ 2 చిత్రంతో బాలీవుడ్‌ని కూడా ట‌చ్ చేస్తుంది. నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ జూలికి సీక్వెల్ గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందించాడు. ఈ మూవీ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి రాయ్ ల‌క్ష్మీకి ఆల్‌ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో పంపారు. ఇందులో చిరు మాట్లాడుతూ.. హాయ్ రాయ్ ల‌క్ష్మీ జూలీ2 నీకు ప్ర‌త్యేక‌మైన సినిమా. నీ కెరీర్‌లో ఇది 50వ సినిమా కాగా, ఈ చిత్రంతో తొలి సారి బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతున్నావు. వివిధ భాష‌ల‌లో న‌టిస్తూ, అభిమానుల‌ని మెప్పిస్తూ ఉన్న నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీలో టాలెంట్‌, స‌త్తాను జూలీ2 చూపిస్తుంద‌ని ఆశిస్తున్నాను అని అన్నారు. జీవితంలో అత్యున్న‌త స్థాయికి చేరుకోవాల‌ని కోరుకుంటున్నాని తెలిపారు. ఇక చివ‌రిగా మ‌రోసారి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఫ్ల‌యింగ్ కిస్ విసిరారు. ఇక చిరు త‌నకి విషెస్ చెప్పేస‌రికి ఆశ్య‌ర్యానికి గురైన రాయ్ ల‌క్ష్మీ ఆ ఆనందంలో వెంట‌నే ట్వీట్ చేసింది. ఓ మై గాడ్ మీ నుండి శుభాకాంక్ష‌లు అందుకోవ‌డం నిజంగా ఒక ఆశీర్వ‌చనం లాంటింది. నా జీవితంలో ఇది ఒక్క గొప్ప బ‌హుమ‌తి. చాలా చాలా ధ‌న్య‌వాద‌ములు చిరంజీవి గారు. మీరిచ్చిన స‌ర్‌ప్రైజ్‌తో ర‌త్తాలు ఆశ్చ‌ర్య‌పోయింది. ల‌వ్ యూ స‌ర్ అని ట్వీట్ చేసింది. ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ ర‌త్తాలు అనే పాట‌కి ఎంతో ఎన‌ర్జిటిక్‌గా స్టెప్పులు వేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.2714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS