‘గుంటూరోడు’ కి చిరు వాయిస్ !

Mon,February 20, 2017 05:37 PM
chiru voice over to gunturodu movie


హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే హిస్టారికల్ మూవీ రుద్రమదేవి, ఘాజీ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూవీతో చిరు ఆడియెన్స్‌కి తన వాయిస్ వినిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న గుంటూరోడు సినిమాకు చిరు వాయిస్ ఓవర్ అందించారు.

ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ‘వరల్డ్స్ స్వీటెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరుకి మా చిత్ర యూనిట్ తరపున ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. పక్కా మాస్ గెటప్‌లో చిరు ఫొటోతో ఉన్న గుంటూరోడు పోస్టర్‌ను ఈ సందర్భంగా మనోజ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఎస్ కే సత్య డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గుంటూరోడు.. లవ్ లో పడ్డాడు (ఉప శీర్షిక)లో మనోజ్‌కి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నంది. మార్చి 3న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

2453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles