ప్యూర్ వెజిటేరియ‌న్‌గా మారిన చిరు

Sun,August 18, 2019 09:49 AM
chiru turns vegetarian

మెగాస్టార్ చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో చురుకుగా ఉంటున్నారు . ఆయ‌న ఇన్సిపిరేష‌న్‌తో ఎంతో మంది కుర్ర హీరోలు టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. చిరు న‌ట‌నలో తెలియ‌ని కిక్‌, డ్యాన్స్‌లో గ్రేస్‌కి ప్రేక్ష‌క‌లోకం ఎంత‌గానో ఫిదా అయింది. ఇప్ప‌టికి ఎంతో ఫిట్‌గా ఉన్న చిరు త్వ‌ర‌లో సైరా స‌ర‌సింహారెడ్డి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు.

సైరా చిత్రం పీరియ‌డ్ డ్రామా కావ‌డంతో ఈ సినిమా కోసం చాలా శారీర‌క శ్ర‌మ చేశారు చిరు. ఇటీవ‌ల ఉసాస‌న‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను శాఖాహారాన్ని ఆలస్యంగా ఆపివేసానని, దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పాడు. అంతేకాక తాను క్రమం తప్పకుండా వర్కవుట్ చేస్తూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చేస్తున్న‌ట్టు తెలిపాడు. తన కుమారుడు రామ్ చరణ్ సూచ‌న‌ల వ‌ల‌న ఈ ప‌ని చేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు మెగాస్టార్‌. ఈ మ‌ధ్య కాలంలో చిరు కాస్త స్లిమ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇందుకు కార‌ణం వెజిటేరియ‌న్‌గా మార‌డం వ‌ల‌న‌నేమో అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

4782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles