‘గెటౌట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’..సైరా ట్రైలర్

Wed,September 18, 2019 05:49 PM


టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాడు..అతడు కారణజన్ముడు. అతనొక యోగి..అతనొక యోధుడు. అతన్ని ఎవ్వరూ ఆపలేరు అనే డైలాగ్స్‌ తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ భూమ్మీద పుట్టింది మేము. ఈ మట్టిలో కలిసేది మేము..మీకెందుకు కట్టాలిరా శిస్తు’ అంటూ చిరు చెప్పే సంభాషణలు బాగున్నాయి.


కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌యనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి. ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సైరా తెర‌కెక్కుతోంది. ర‌త్న‌వేలు చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌.2084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles