చిరంజీవి అల్లుడు సినిమా స్టార్ట్ అయింది

Wed,January 31, 2018 10:12 AM
chiru son in law movie launched officially

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ క‌ళ్యాణ్ డెబ్యూ మూవీ లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వారాహి సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభ‌మైన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వ‌హించ‌నున్నాడు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్‌కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నామ‌ని నిర్మాత సాయి కొర్ర‌పాటి అన్నారు. "బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు . చిత్రంలో తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటిస్తున్నారు.



2471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles