చిరంజీవి అంత బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణం ?

Tue,June 19, 2018 12:05 PM
chiru presonality grows high for Syeraa  movie

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మెగా ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దులు లేకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్ట‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ప్ర‌స్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం కోకాపేట్ దగ్గర 7 ఎకరాల్లో భారీ సెట్ ను నిర్మించారు. 40 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన ముఖ్య మైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చిరంజీవి లుక్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి అభిమానుల‌లో ఉండ‌గా, ఇటీవ‌ల లొకేష‌న్‌లోని కొన్ని ఫోటోలని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసి అనుమానాలు నివృత్తి చేశాడు. అయితే 150వ చిత్రం కోసం పూర్తి ఫిట్‌నెస్‌తో కాస్త స్లిమ్‌గా త‌యారైన చిరు ఇప్పుడు సైరా కోసం భారీగా లావు అవుతున్నార‌ట‌. ప‌లు ఈవెంట్స్‌లో క‌నిపించిన చిరుని చూస్తే ఆయ‌న లావ‌య్యార‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ముస‌లి వ్య‌క్తిగా క‌నిపించే క్ర‌మంలో చిరు లావు అవుత‌న్నార‌ని \స‌మాచారం.

తాజా షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి .. తమన్నా కూడా పాల్గొంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని టాక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది.

4537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles