గోవిందంపై చిరు, రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

Thu,August 16, 2018 09:12 AM
chiru praise the vijay performance

పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టి ఆక‌ర్షించిన విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల‌పై విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత గోవిందం చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల కాగా, ఈ మూవీకి పాజిటివ్ టాక్ ల‌భించింది. అభిమానులు , ప్రేక్ష‌కులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా మూవీపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురించారు. మెగాస్టార్ చిరంజీవి గీత గోవిందం స్పెష‌ల్ షో చూసి విజ‌య్ తో పాటు టీంని అభినందించారు. ఇక రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో సినిమాని ఆకాశానికి ఎత్తాడు. ‘గీత గోవిందం’ సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. విజయ్‌ దేవరకొండ.. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. కానీ అర్జున్‌ రెడ్డి వంటి సినిమా తర్వాత ఇది నీ బెస్ట్‌ చాయిస్‌. తానేం చేస్తున్నాడో విజయ్‌కు బాగా తెలుసు. సినిమా అంతా సరదా సన్నివేశాలతో నింపేశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించావు పరశురాం..’ అని ట్వీట్ చేశాడు. మీ నుండి ప్ర‌శంస‌లు రావడం గొప్ప విష‌యం అని రాజ‌మౌళి ట్వీట్‌కి స‌మాధానం ఇచ్చాడు.


4709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles