చెర్రీ సినిమాకు ఆసక్తికర టైటిల్

Tue,September 25, 2018 07:09 PM
Chiru movie title for Ramcharan 12th Movie

టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెర్రీ 12 వ సినిమా కోసం ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

90లలో చిరు నటించిన స్టేట్ రౌడీ చిత్రం ఏ స్థాయిలో బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇపుడు ఇదే సినిమా టైటిల్‌ను చెర్రీ, బోయపాటి సినిమాకు పెడితే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రానికి స్టేట్ రౌడీ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. దీంతోపాటు రాజవంశస్థుడు, రాజమార్తాండ అనే టైటిల్స్ కూడా పరిశీలన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరీ చరణ్ సినిమాకు ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

6005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles