పూజ కోసం వెండితో ప్ర‌త్యేక మండపం చేయించుకున్న చిరు

Fri,August 2, 2019 06:12 PM
chiru latest pic goes viral

కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌.. ఈ పేరు కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. చిరంజీవి అంటే మాత్రం ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న‌ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆంజ‌నేయ భ‌క్తుడైన మెగాస్టార్ త‌న పేరుని చిరంజీవిగా ఎలా మార్చుకున్నాడో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే దైవ భ‌క్తి ఎక్కువ‌గా ఉన్న చిరు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కంచిగారి వీధిలో ఉన్న రంగణ్ణచారి సన్స్‌ అండ్‌ మెటల్‌ వర్క్స్‌లో వెండి మండ‌పం చేయించుకున్నారు. దీనిని ఎప్పుడో ఆర్డ‌ర్ ఇవ్వ‌గా, గురువారం చిరు ఇంటికి చేరింది. దీనిని చిరంజీవి పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు. వెండి మండ‌పంతో పాటు దానిని త‌యారు చేసిన వారితో చిరు ఫోటోలు దిగ‌గా, ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చిరు న‌టించిన సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ఆగ‌స్ట్ 22న త‌న 152వ చిత్రాన్ని మొద‌లు పెట్ట‌నున్నాడు చిరు

3213
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles