రచయిత నుండి దర్శకుడిగా మారి కేవలం కమర్షియల్‌గానే కాకుండా మంచి సందేశం ఉన్న సినిమాలని తీస్తూ ప్రేక్షకులని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడట. ఈ మూవీ కూడా సందేశాత్మక విలువలతో కూడిన చిత్రంగా ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే దానిపై అభిమానులలో సందిగ్ధం నెలకొనగా, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వేసవి నుండి స్టార్ట్ కానుందని తెలుస్తుంది. చిరు ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా మూవీ చేస్తుండగా, ఫిబ్రవరి లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందట. ఆ వెంటనే కొరటాల టీంతో కలిసి వాణిజ్య విలువలతో పాటు మంచి సందేశం ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించనున్నాడు చిరు . ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది. కొరటాల- చిరు సినిమాకి కూడా రామ్ చరణ్ నిర్మాత అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను .. బిలియనీర్ గాను ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్.