చిన్నారి ఫ్యామిలీని ఇంటికి పిలిచి సత్కరించిన చిరు

Tue,August 28, 2018 04:52 PM
chiru impressed bt haasini performance

మెగాస్టార్ చిరంజీవి 63వ బర్త్ డే వేడుకలు ఆగస్ట్ 21 సాయంత్రం శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ , అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో విజయవాడకి చెందిన ఏడేళ్ళ చిన్నారి హాసిని గుక్కతిప్పుకోకుండా చిరంజీవి నటించిన 150 సినిమా పేర్లను, వాటి రిలీజ్ డేట్స్ చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది.అంతేకాదు డైరెక్టర్.. ప్రొడ్యూసర్స్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇలా అన్ని వివరాల్ని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ చిన్నారి. ఎంతో పరిపక్వతతో ఆ చిన్నారి చెప్పిన తీరుకి ఇంప్రెస్ అయిన చిరు ఆ పాప కుటుంబ సభ్యులని తన ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. ఆ సమయంలో రామ్ చరణ్ కూడా ఉన్నారు. చిరు, చెర్రీలతో ఆ కుటుంబ సభ్యులు ఫోటోలు దిగి సరదా సమయాన్ని గడిపారు. హాసిని ఫ్యామిలీ మెగాస్టార్ తో దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

6269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS