విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం ఇంటా బయట రచ్చ చేస్తుంది. ఓవర్సీస్ లోను ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతుంది. గీత గోవిందం థియేటర్స్ దగ్గర ఇప్పటికి హౌజ్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షమవుతున్నాయంటే ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, సమంత, రామ్ చరణ్ , అల్లు అర్జున్ తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. గీతా ఆర్ట్స్ 2 బేనర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించినందుకు ఈ రోజు సాయంత్రం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సక్సెట్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై యూనిట్ సభ్యులని అభినందించనున్నారు. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా చిత్ర విజయంలో సగ భాగం అయిందనే సంగతి తెలసిందే. సెలబ్రేషన్లో భాగం అయ్యేందుకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవొచ్చని యూనిట్ తెలిపింది.