హ‌లో.. అఖిల్ పెద‌నాన్న చిరంజీవి.. పెద్ద‌న్న‌య్య రామ్ చ‌ర‌ణ్‌

Thu,December 21, 2017 11:16 AM
chiru and charan at akhil pre release event

అక్కినేని అఖిల్ త‌న రెండో సినిమాగా హ‌లో చిత్రంతో రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్డూడియో బేన‌ర్‌పై నాగ్ నిర్మించాడు. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో రెండో సినిమాని అఖిల్ చాలా క‌సిగా చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక అఖిల్ తండ్రి నాగ్ కూడా హ‌లో సినిమాతో సిసింద్రీకి మంచి విజ‌యం అందించాల‌ని భావిస్తున్నాడు. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంగ‌తి ప‌క్క‌న పెడితే, మూవీని ఏ రేంజ్‌లో ప్ర‌మోష‌న్‌లో ఆ రేంజ్‌లో చేసేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా నోవాటెల్ లో హ‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

గ‌తంలో ఏ ఆడియో ఫంక్ష‌న్‌కి చిరు, రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి గెస్ట్‌లుగా హాజ‌రు కాలేదు. కాని నిన్న జ‌రిగిన హ‌లో ప్రీ రిలీజ్ వేడుక‌కి చిరుతో పాటు చ‌ర‌ణ్ కూడా హాజ‌రు కావ‌డంతో అక్క‌డ వాతావ‌ర‌ణం సంద‌డిగా మారింది. ఇక అఖిల్ సినిమాను వారు ఆకాశానికి ఎత్తేయ‌డంతో మెగా ఫ్యాన్స్ కూడా హ‌లో సినిమాని ఎప్పుడెప్పుడా చూద్దామా అని వెయిట్ చేస్తున్నార‌ట‌. ఇక ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడుతూ..‘మా పెదనాన్న చిరంజీవికి.. మా పెద్దన్నయ్య రామ్ చరణ్ కు థ్యాంక్స్’’ అంటూ చెప్పేసరికి ఆడిటోరియం అరుపుల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఇక నాగ్ కూడా ‘‘అఖిల్ కు.. రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. వాళ్లిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్సయ్యారో.. ఎప్పటి నుంచి పెద్దన్నయ్య అని పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ అలా పిలవడం చాలా బాగుంది. సో హ్యాపీ’’ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఏదేమైన ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉన్న ఈ బంధుత్వం ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డేసరికి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

3052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles