మున్నాభాయ్‌తో శంక‌ర్‌దాదా.. వైర‌ల్‌గా మారిన పిక్స్‌

Fri,January 11, 2019 08:24 AM

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం ఎంత‌టి పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేసి అతి పెద్ద విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు ఈ మున్నాభాయ్ , శంక‌ర్ దాదాలు క‌ల‌వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఈవెంట్‌లో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు సంజయ్ ద‌త్‌ని క‌లిసారు. వారు క‌లిసి దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఉపాస‌న.. చ‌ర‌ణ్‌, చిరంజీవి, సంజ‌య్ ద‌త్ క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ‘సంజయ్ దత్ భాయ్‌తో ‘మిస్టర్ సి’ ముచ్చటిస్తున్నారు. ఈ సాయంత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అనే కామెంట్ పెట్టారు. చిరంజీవి.. సంజ‌య్ న‌టించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్‌తో పాటు ల‌గే ర‌హో మున్నాభాయ్ అనే చిత్రాన్ని కూడా రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘లగె రహో మున్నాభాయ్’ చిత్రం తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’గా విడుద‌లైంది. ఇక సంజ‌య్ ద‌త్‌కి చ‌ర‌ణ్ తోను మంచి అనుబంధం ఉంది. వారిద్ద‌రు‘తుఫాన్’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
2451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles