సైరాకి పాజిటివ్ టాక్.. ఆనందంలో తండ్రి,త‌న‌యుడు

Wed,October 2, 2019 01:02 PM

రేనాటి వీరుడు.. తొలి స్వాతంత్య్ర‌ సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. అన్ని చోట్ల నుండి చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో చిరు, రామ్ చ‌ర‌ణ్‌లు స‌క్సెస్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌ని త‌న‌యుడు నిర్మించ‌డం, ఆ సినిమా మంచి హిట్ కావ‌డంతో భావోద్వేగానికి గురైన చిరు .. చర‌ణ్‌కి ముద్దు ఇచ్చి సంతోషాన్ని తెలియ‌జేశాడు. జూలియస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , అమిత్ త్రివేది సంగీతం , ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని విభాగాలు స‌క్సెస్ కావ‌డంతో సినిమా మంచి హిట్ కొట్టింద‌ని చెబుతున్నారు.3165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles