సుకుమార్-చిరు ప్రాజెక్ట్ పై ఆసక్తికర అప్ డేట్

Mon,October 14, 2019 06:04 PM


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లూసిఫర్. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్టుపై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సైరా చిత్రం మంచి విజయం సాధించడంతో..చిరు తన తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది.


కొరటాల శివ మూవీ తర్వాత సుకుమార్ తో కలిసి లూసిఫర్ ను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట చిరు. రంగస్థలం సినిమాతో రాంచరణ్ కు మరిచిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ లూసిఫర్ చిత్రానికి సరైన న్యాయం చేస్తాడని చిరు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సుకుమారు-చిరు ప్రాజెక్టును రాంచరణ్ తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిరు-సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మెగా అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.

2009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles