తిరిగి సినిమాల్లో నటిస్తారనుకున్నా..కానీ : చిరంజీవి

Mon,February 19, 2018 08:53 PM
Chiranjeevi Condolence to Gundu Hanumantharao


హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతితో తెలుగు చిత్రపరిశ్రమ ఓ గొప్పనటుడిని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి ఆ దేవుణ్ణి ప్రార్థించారు. గుండు హనుమంతరావు తనదైన శైలితో కోట్లాది మంది తెలుగు ప్రజలకు వినోదాన్ని అందించారని తెలిపారు. ఆ మధ్య గుండు హనుమంతరావు అనారోగ్యానికి గురైనట్లు తెలిసి, బాధపడినట్లు ఈ సందర్భంగా చిరు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి తెలిసిన వెంటనే తనవంతుగా సాయం చేసినట్లు చెప్పారు. హనుమంతరావు పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తారని అనుకుంటే..ఇంతలోనే పెద్ద దుర్వార్త వినాల్సి వచ్చిందని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

4702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS