152వ సినిమా కోసం జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న చిరు!

Sat,November 9, 2019 10:10 AM

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న ఎంద‌రికో ఆద‌ర్శం. చిరుని చూసి హీరో కావాల‌ని క‌ల‌లు క‌న్న‌వారు ఎంద‌రో ఉన్నారు. దాదాపు ఆరేళ్ళ త‌ర్వాత ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరుకి ఈ చిత్రం మంచి విజ‌యం అందించింది. రీసెంట్‌గా సైరా అనే చారిత్రాత్మ‌క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక ప్ర‌స్తుతం త‌న 152వ సినిమాగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు చిరు. దేవాల‌యాల‌కి సంబంధించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. అయితే ఈ మూవీ కోసం బ‌రువు తగ్గేందుకు చిరు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.


ప్ర‌స్తుతం చిరు జిమ్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇది పాత ఫోటో అని కొంద‌రు అంటున్నారు. అందుకు కార‌ణం చిరు రీసెంట్‌గా వ్య‌క్తిగ‌త ప‌నుల మీద‌ అమెరికాకి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. అక్క‌డ నుండి తిరిగి రాగానే డిసెంబర్‌ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్న చిత్రంలో త్రిషని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

1135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles