‘చి.ల.సౌ’ ఫస్ట్‌లుక్ విడుదల

Sat,March 17, 2018 06:08 PM
ChiLaSow first look released

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ చివరిగా ఆటాడుకుందాం.. రా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ‘చి.ల.సౌ’ అనే టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సుశాంత్ . నటుడిగా రాణిస్తున్న రాహుల్ రవీంద్రన్ కి డైరెక్షన్ పరంగా ఈ మూవీ డెబ్యూ కానుంది. రుహని శర్మ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. రేపు సుశాంత్ బర్త్ డే తో పాటు ఉగాది రెండు కలిసి రావడంతో కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సుశాంత్ చాలా కూల్ గా కనిపిస్తున్నాడు.

2542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles