యాసిడ్ బాధితురాలి పాత్ర‌లో దీపికా.. ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,December 10, 2019 05:11 PM

దీపికా ప్ర‌ధాన పాత్ర‌లో మేఘ‌నా గుల్జార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఛ‌పాక్‌. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. ప్ర‌పంచ మాన‌వ హ‌క్కుల దినోత్సవం సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మాల్తీ అనే పాత్ర‌లో క‌నిపించిన దీపికా.. యాసిడ్ భాదితురాలి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. యాసిడ్ దాడి త‌ర్వాత త‌న ముఖాన్ని అద్దంలో చూసి బాధితురాలు ఎంతగా చ‌లించిపోయిందో ట్రైల‌ర్‌లో చూపించారు. చున్నీ లేకుండా బ‌య‌ట తిరిగిన మాల్తీ త‌ర్వాత చున్నీని గాల్లోకి విసిరేసి స్వేచ్చ‌గా జీవ‌నం ఎలా కొన‌సాగించిందో సినిమాలో చూపించ‌నున్నారు.


ప్రేమ‌ని నిరాక‌రించిందనే కోపంతో 14 ఏళ్ల క్రితం ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై యాసిడ్ దాడి జ‌రిగింది. దాడిలో ముఖం, మెడ భాగం పూర్తిగా కాలింది. త‌న ఫేస్‌కి ప‌లు స‌ర్జ‌రీలు చేయించుకొని స‌మాజంలో జీవ‌నం కొన‌సాగిస్తుంది. త‌న‌లాంటి బాధితుల‌కి అండ‌గా నిలుస్తున్న ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. అందుకే ఆమె జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నారు. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ లుక్ లోకి మారేందుకు దీపికాకి నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట. ఇక ఆ మేక‌ప్ తీసేందుకు కూడా చాలా టైం ప‌డుతుంద‌ట‌. పద్మావత్ తర్వాత దీపికా న‌టిస్తున్న ఛ‌పాక్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంది.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles