ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున ఛ‌పాక్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sun,December 8, 2019 10:58 AM

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం ఛ‌పాక్. ఈ మూవీలో దీపికా.. యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపిస్తున్నది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. రాజీ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ప్లే చేయడంతోపాటు సినిమా ప్రొడ్యూసర్ కూడా దీపికానే కావడం విశేషం. దీపికా లుక్‌కి సంబంధించిన ఇటీవ‌ల‌ కొన్ని ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో దీపికా అచ్చు గుద్దిన‌ట్టు.. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ మాదిరిగానే క‌నిపించింది. ఆ లుక్‌లోకి మారేందుకు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట ఇక ఆ మేక‌ప్ తీసేందుకు కూడా చాలా టైం ప‌డుతుంద‌ట‌. పద్మావత్ తర్వాత దీపికా న‌టిస్తున్న ఛ‌పాక్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. అయితే చిత్ర ట్రైల‌ర్‌ని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజు అంటే డిసెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. యాదృచ్చికంగా అదే రోజు మా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌వుంద‌ని ద‌ర్శ‌కుడు ఓ పత్రిక‌కి తెలియ‌జేశారు.

796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles