'దేవ‌దాస్' నుండి మ‌రో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

Thu,September 6, 2018 10:08 AM
Chettu Kinda Doctor Lyrical  song released

నాని, నాగ్ నటిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ దేవదాస్ . సెప్టెంబర్ 27 చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూవీపై ఆస‌క్తి పెంచేలా టీజ‌ర్స్ ,సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. తాజాగా చెట్టు కింద డాక్ట‌ర్ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ని ప‌ద్మ ల‌త పాడింది. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు . సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు . తాజాగా విడుద‌లైన సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.

2057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles