బాబాయ్ స్పూర్తితో జీవితంలో ధైర్యం చేశాన‌న్న చెర్రీ

Sun,September 2, 2018 10:48 AM
cherry post birthday gift of pawan fans

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి త‌న బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ను న‌టించిన రంగ‌స్థ‌లం చిత్ర స‌క్సెస్ వేడుక‌కి గెస్ట్‌గా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స్టేజ్‌పైనే ముద్దు పెట్టి త‌న ప్రేమ‌ని అంద‌రికి తెలియ‌జేశాడు.అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ స్వీట్ అండ్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు నిన్న త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం లేదు కాబ‌ట్టి త‌న సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి మెగా ఫ్యాన్స్‌కి ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇస్తార‌ని అంద‌రు ఊహింంచారు. కాని అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ తాను ఓ వీడియోని పోస్ట్ చేశాడు. బాబాయ్ మీ ప్రేర‌ణ‌తోనే జీవితంలో, సినిమాల‌లో ధైర్యంగ‌ల విష‌యాలు చేశాను. మొద‌టి సారి మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా మీ కోసం ఇలా చేయాల‌నిపించింది. ఇది మీకే అంకితం అంటూ పోస్ట్ పెట్టాడు చెర్రీ. ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్నాడు చెర్రీ. ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ్యామిలీతో క‌లిసి ఆయ‌న ఇంటికి వెళ్లి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ అందజేస్తాడ‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.

2439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS