ఫోక్ సాంగ్‌లో అద‌ర‌గొట్టిన శ్రీను, పూజా

Wed,July 25, 2018 01:03 PM
Cheliya Choode Lyrical Video song released

ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం ప్ర‌తి సినిమాలో ఓ మాస్ మ‌సాలా సాంగ్ లేదంటే ఫోక్ సాంగ్ ఉండి తీరాల్సిందే. ఆడియన్స్ అభిరుచిని బ‌ట్టి ద‌ర్శ‌క నిర్మాత‌లు ట్రెండ్‌కి త‌గ్గ పాట‌ల‌ని సినిమాలో పెడుతున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా తెర‌కెక్కిన సాక్ష్యం సినిమాలో ఓ ఫోక్ సాంగ్ పెట్టారు. ‘చెలియా చూడె’ అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్‌కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. తాజాగా విడుద‌లైన లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. శ్రీవాస్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, మీనా కీలక పాత్రలో నటించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. జూలై 27న సాక్ష్యం చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

3885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles