రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మ‌ణిర‌త్నం చిత్రం

Sun,August 12, 2018 09:33 AM
Chekka Chivantha Vaanam movie release date fixed

ఇటీవ‌ల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో వార్త‌లలోకి వ‌చ్చిన మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో చిత్రం చేస్తుండ‌గా, తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో ఈ మూవీ విడుద‌ల కానుంది. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ మ‌ల్టీ స్టార‌ర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అనారోగ్యం వ‌ల‌న నిర్మాణాంతరాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన మ‌ణి, ప్ర‌స్తుతం వేగం పెంచిన‌ట్టు తెలుస్తుంది. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలోని హీరోలంతా అన్నదమ్ములుగా కనిపించనున్నారు. రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఈ నెలలో టీజర్ ను .. వచ్చే నెల ఆరంభంలో ట్రైలర్ ను విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. చెలియా త‌ర్వాత మ‌ణిర‌త్నం చేస్తున్న ఈ మూవీపై త‌మిళంలోనే కాదు తెలుగులోను భారీ అంచ‌నాలు ఉన్నాయి.

1430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles