షెడ్యూల్ పూర్తైన సంద‌ర్భంగా స్మాల్ పార్టీ

Wed,May 23, 2018 08:38 AM
cheery and kiara be part of small party

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, గ్లామ‌ర్ బ్యూటీ కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బోయపాటి క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ 12వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ని బ్యాంకాక్‌లో తెర‌కెక్కించాడు బోయపాటి. బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో చెర్రీ, కైరా అండ్ టీం స్మాల్ పార్టీ చేసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని వీడియో ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, ఈ చిత్రానికి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రగ‌నుంది.1806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles