పైల‌ట్ లుక్‌లో శ్రీదేవి కూతురు.. వైర‌ల్‌గా మారిన ఫోటో

Wed,December 26, 2018 01:09 PM

దివంగ‌త శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు జాన్వీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో న‌టిస్తుంది జాన్వీ. తక్త్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది.


ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత‌మాధారంగా ఓ సినిమాని తెర‌కెక్కించాల‌ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ భావిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి . గుంజన్‌ పాత్రలో జాన్వీ న‌టిస్తుంద‌ని , ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపింద‌ని స‌మాచారం . జాన్వి, గుంజన్‌ కలిసి దిగిన ఫొటో కూడా అప్ప‌ట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా పైల‌ట్ లుక్‌లో జాన్వీ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ఫోటోని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్ర‌శంస‌లు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ కూడా అందించింది.2981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles