అభిమాని ఛాతిపై పూరీ టాటూ.. వీడియో షేర్ చేసిన ఛార్మి

Wed,July 31, 2019 12:30 PM
Charmme shares nice video in twitter

టెంప‌ర్ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమా ఇటు రామ్‌కి, అటు పూరీకి చెప్ప‌లేనంత ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకునేందుకు చిత్ర బృందం పలు ప్రాంతాల‌లో సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది. తాజాగా హ‌న్మ‌కొండ‌కి వెళ్లిన పూరీకి ఓ అభిమాని స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న ఛాతిపై వేసుకున్న ప‌చ్చ‌బొట్టుని చూపిస్తూ కాళ్ళు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియోని ఛార్మి కౌర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. డై హార్డ్ ఫ్యాన్ ప్ర‌భాక‌ర్ త‌న ఛాతిపై పూరీ టాటూ వేయించుకున్నాడు. నువ్వు నా హృద‌యాన్ని తాకావు అని కామెంట్‌లో తెలిపింది.

ఆ మ‌ధ్య రామ్ అభిమాని ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావాల‌ని మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కాడు. ఈ వీడియో రామ్ కంట ప‌డ‌డంతో ఆయ‌న భావోద్వేగంతో స్పందించారు. డియ‌ర్ సందీప్‌.. నీ ప్రేమ నా హృద‌యాన్ని తాకింది. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావ‌ని అనుకుంటున్నాను. మీరు నాపై ఇంత ప్రేమ చూపించ‌డానికి నేను ఏం చేశానో అర్ధం కావ‌డం లేదు. మీలాంటి వారంద‌రి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మీలాంటి అభిమానులు నాకు దొర‌క‌డం నా అదృష్టం అని రామ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఛార్మి కూడా ఆ వీడియోపై స్పందించింది . నువ్వు నన్ను ఏడిపించావు సందీప్‌..నీకు కృత‌జ్ఞ‌త‌లు ఒక్క‌టి చెబితే స‌రిపోదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని తిరుమ‌ల మెట్లు మోకాలితో ఎక్కావు. మాపై ఎంతో ప్రేమ‌, అనురాగం చూపించావు అని ట్వీట్ చేసింది.

2063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles