ఏ టైంలో పుట్టావు, నీ జాత‌కానికి ఓ న‌మ‌స్కారం : ఛార్మీ

Sat,July 6, 2019 11:36 AM
charmee funny  tweet to sam

మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఓ బేబీ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా స‌మంత అభిన‌యానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. స‌మంత త‌ప్ప ఆ పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించుకోలేమంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినీ అభిమానులే కాక సెల‌బ్రిటీలు కూడా స‌మంత‌ని ఆకాశానికి ఎత్తుతున్నారు. తాజాగా బ‌బ్లీగార్ల్ ఛార్మీ త‌న ట్విట్ట‌ర్‌లో ''ఏ టైం కి పుట్టావ్ అమ్మ నువ్వు..? నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్ అండ్ నీ జాతకంకి నమస్కారం'' అంటూ స‌మంత‌ని ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసింది. దీనికి స‌మాధానంగా ‘నువ్వు ఎంతో క్యూటెస్ట్‌.. ధన్యవాదాలు ఛార్మి. నీకు నా ఆత్మీయ కౌగిలి, ముద్దుల్ని పంపుతున్నా’ అని ట్వీట్ చేసింది స‌మంత‌. వీరిద్దరి మ‌ధ్య సాగిన ట్వీట్ చ‌ర్చ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా అల‌రించిన ఛార్మి ప్ర‌స్తుతం నిర్మాత‌గా కొన‌సాగుతుంది. ఆమె నిర్మాణంలో రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం జూలై 18న విడుదల కానున్న విష‌యం తెలిసిందే.


6321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles