అమ‌లాపాల్ క‌ట‌క‌టాలు లెక్క పెట్ట‌నుందా ?

Tue,June 19, 2018 10:41 AM
charge sheet on amala paul in the issue of car registration

కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా ప‌త్రాన్ని చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ అమ‌లాపాల్‌పై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేఖ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. దీనిపై కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ హీరోయిన్‌కి నోటీసులు జారీ చేసినా.. సరైన స్పందన లేకపోవడంతో పోలీసులు హైకోర్టుని ఆశ్ర‌యించారు. అయితే త‌న‌ని అరెస్ట్ చేస్తారేమోన్న భ‌యంతో ముంద‌స్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటీష‌న్ దాఖలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

పుదుచ్చేరిలో కార్ల రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టారనే నేరం కింద కేరళ పోలీసులు ఈమెపై మరో నెల రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నార‌ని తాజా స‌మాచారం. ప్రముఖ యువ నటుడు ఫహద్ ఫాసిల్ సైతం ఇదే తరహాలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా రుజువైనప్పటికీ, ఆ తర్వాత అతడు తన నేరాన్ని అంగీకరించి రూ.17.68 లక్షల జరిమానా చెల్లించడంతో ఆ కేసులో అతడిపై కేసుని కొట్టేసినట్టు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న అమలాపాల్, సురేష్ గోపీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే కేరళ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం.

3057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles