నాలుగో సారి చిరుతో సంద‌డి చేయ‌నున్న చ‌ర‌ణ్

Wed,July 31, 2019 09:55 AM
charan and chiru team up again

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా వెండితెర ఆరంగేట్రం చేసిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం న‌టుడిగానే కాదు నిర్మాత‌గాను బిజీ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డంతో పాటు సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే త‌న తండ్రి అడుగుజాడ‌ల‌లో న‌డుస్తూ ఒక్కోమెట్టూ ఎక్కి ఉన్న‌త స్థాయికి చేరుకున్న రామ్ చ‌ర‌ణ్ .. చిరు న‌టిస్తున్న సినిమాల‌లో గెస్ట్ రోల్ పోషించేందుకు చాలా ఆస‌క్తి చూపిస్తున్నాడు.

చిరు, రామ్ చ‌ర‌ణ్ తొలి సారి మ‌గ‌ధీర సినిమాలో క‌లిసి క‌నిపించ‌గా ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టించిన‌ బ్రూస్‌లీ చిత్రంలో చిరు గెస్ట్ పాత్ర పోషించారు. ఇక రీసెంట్‌గా విడుద‌లైన ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో చ‌ర‌ణ్‌, చిరు ఇద్ద‌రు క‌లిసి ఓ పాట‌లో సంద‌డి చేశారు. ఇప్పుడు నాలుగో సారి కొర‌టాల శివ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో వీరిద్ద‌రు క‌లిసి సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 22న కొర‌టాల‌- చిరు చిత్రం ప్రారంభం కానుండ‌గా, ఇందులో చెర్రీ కోసం ప్ర‌త్యేక పాత్ర సిద్దం చేశాడ‌ట కొర‌టాల‌. ఆ పాత్ర‌లో న‌టించేందుకు చర‌ణ్ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రంలో న‌యనతార, కాజల్ , శృతి హాసన్‌ల‌లో ఒక‌రు క‌థానాయిక‌గా న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles