25 ఏళ్ళ ‘చంటి’

Wed,January 11, 2017 11:49 AM
25 ఏళ్ళ ‘చంటి’

జనవరి 10, 1992లో తెలుగు డ్రామా ఫిలింగా తెరకెక్కిన చిత్రం చంటి. తమిళ చిత్రం చిన్న తంబీ మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించాడు. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయ రాజా తనదైన బాణీలు అందించాడు. ఈ చిత్రం హిందీలో అనారీ పేరుతో 1993లో విడుదలై మంచి విజయం సాధించింది. హిందీలో వెంకటేష్, కరిష్మా కపూర్ లీడ్ రోల్స్ చేశారు. కెఎస్ రామారావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తాజాగా 25 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వెంకటేష్ తన అఫీషియల్ పేజ్ ద్వారా అందరికి థ్యాంక్స్ చెప్పాడు.

చంటి చిత్రం 40 థియేటర్స్ లో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డులు సాధించింది. ఇది అప్పట్లో ఆల్ టైం రికార్డు. చంటి చిత్రంలోని వెంకటేష్ నటనతో పాటు నాజర్, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య తదితరుల పర్ ఫార్మెన్స్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. ఈ సినిమాను ఇంటిల్లపాది ఆదరించారంటే చంటి చిత్రం ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

1656
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS