చంద్ర‌బాబు పాత్ర‌లో వినోద్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,September 25, 2018 08:52 AM
Chandrodayam first look revealed

మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌డావిడి ఎక్కువ‌గా ఉండ‌గా, ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోను వ‌రుస బ‌యోపిక్‌లు రూపొందుతున్నాయి. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో నిర్మాత‌ల‌లో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో ప‌లువురు ప్రముఖుల బ‌యోపిక్స్‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు . ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కాంతారావు త‌దిత‌రుల బ‌యోపిక్స్ టాలీవుడ్‌లో రూపొందుతుండ‌గా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట రమణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు.

చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిస్తున్న చంద్రోదయం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు . అక్టోబ‌ర్ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పీఆర్‌ బాణీలు అందిస్తున్నారు. 80 శాతం చిత్ర షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుంది. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం అని ద‌ర్శ‌కుడు అన్నారు. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. అయితే చంద్రబాబు గారి పాత్రలో తాను నటించటం త‌న‌ పూర్వజన్మ సుకృతం అని, అందరి ఆశీర్వాదాలతో,సహాయ సహకారాలతోనే ఇది త‌న‌కు సాధ్యమయింది అని వినోద్ అన్నారు. త‌న‌కి అవకాశం డైరెక్టర్ వెంకటరమణ గారికి, చిరంజీవి గారికి హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు తెలిపారు.


3949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS