చంద్ర‌బోస్ ఇంట్లో విషాదం

Tue,May 21, 2019 08:18 AM
Chandrabose mother is no more

ప్ర‌ముఖ సినీ రచ‌యిత చంద్ర‌బోస్ త‌ల్లి మ‌ద‌న‌మ్మ గుండెపోటుతో క‌న్నుమూశారు. దీంతో చంద్ర‌బోస్ ఇంట్లో విషాదం నెల‌కొంది. అమ్మ గురించి చంద్ర‌బోస్‌ ఎన్నో పాట‌లు రాసారు. అందులో పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ’ అనే పాట ఇప్ప‌టికి ఎప్ప‌టికి హైలైటే. చంద్ర‌బోస్ తండ్రి పేరు న‌ర్స‌య్య. ఆయ‌న ఉపాధ్యాయుడిగా ప‌నిచేశారు. న‌ర్స‌య్య‌, మ‌ద‌నమ్మ‌కి న‌లుగురు సంతానం కాగా చంద్ర‌బోస్ అంద‌రిలో చిన్న‌వాడు. ప్ర‌స్తుతం సినీ ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తూనే ప‌లు షోస్‌కి జ‌డ్జిగా వ్యవ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బోస్‌. వారి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్ తల్లి అంత్యక్రియలు జ‌రిగాయి.

4622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles