ఎన్టీఆర్‌లో దాస‌రి పాత్ర పోషిస్తుంది ఎవ‌రో తెలుసా ?

Tue,November 13, 2018 10:43 AM
Chandra Siddhartha plays a role of dasari

టాలీవుడ్‌లో అత్యంత‌ ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా విడుద‌ల కానుండ‌గా, ఇందులో భారీ తారాగ‌ణం పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ సినిమా జీవితంతో పాటు రాజ‌కీయ జీవితాన్ని కూడా వెండితెర‌పై చూపించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు క్రిష్‌. అయితే ఇప్ప‌టికే చిత్రంలో ప‌లువురు ద‌ర్శ‌కుల‌ని వేరు వేరు పాత్ర‌ల కోసం ఎంపిక చేయ‌గా, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్‌ని ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం దర్శకుడు చంద్ర సిద్ధార్ధ్‌ని దాస‌రి పాత్ర కోసం ఎంపిక చేశారని, ఆయ‌న‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ని త్వర‌లోనే తెర‌క‌కెక్కించనున్నార‌ని అంటున్నారు. చంద్ర సిద్ధార్ద్‌కి దాస‌రి పోలిక‌లు ఉండ‌డంతో ఆయ‌న‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ చిత్రంలో గుమ్మడిగా .. దర్శకుడు దేవి ప్రసాద్ న‌టిస్తుంటే క్రిష్.. కేవీ రెడ్డిగా, ఎన్ శంకర్.. విఠలాచార్యగా క‌నిపించ‌నున్నారు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య , అక్కినేనిగా సుమంత్‌, హెచ్ ఎం రెడ్డిగా స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీదేవిగా ర‌కుల్ , హ‌రికృష్ణగా క‌ళ్యాణ్ రామ్, బ‌స‌వ‌తార‌కంగా విద్యా బాల‌న్ , చంద్ర‌బాబుగా రానా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు

2429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles