గోపిచంద్ 'చాణ‌క్య' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wed,June 12, 2019 02:59 PM

కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బంది ప‌డుతున్న మాచో హీరో గోపిచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు 25 చిత్రాల‌లో న‌టించాడు. ఆయ‌న 2001లో తొలివ‌ల‌పు అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యాడు. ప్ర‌స్తుతం త‌న 26వ చిత్రంగా త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో చాణ‌క్య అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైన‌ప్ప‌టికి, ఆ మ‌ధ్య‌లో గోపిచంద్ యాక్సిడెంట్ వ‌ల‌న చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ని మ‌ళ్ళీ మొద‌లు పెట్టారు. ఈ రోజు గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.


ఇందులో గోపిచంద్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. చాణ‌క్య చిత్రం స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండ‌గా, ఇందులో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. చిత్రానికి కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి, నిర్మాత : రామబ్రహ్మం సుంకర.


1966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles